అఫీషియల్ : “అనిమల్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.!

అఫీషియల్ : “అనిమల్” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Jan 25, 2024 1:10 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “అనిమల్” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం అంచనాలు అందుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు అందుకుంది.

ఇక గత కొన్ని రోజులు నుంచి అనిమల్ ఓటిటి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారగా ఎట్టకేలకి చాలా రోజుల బజ్ అనంతరం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రాన్ని మొదటి నుంచి గట్టిగా వినిపిస్తున్న డేట్ జనవరి 26నే విడుదల చేస్తున్నట్టుగా లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.

దీనితో రేపటి నుంచి ఈ చిత్రం తెలుగు, హిందీ తమిళ్ సహా మళయాళ కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు