అద్దిరిపోయేలా “ఒకే ఒక జీవితం” టీజర్!

Published on Dec 29, 2021 6:27 pm IST


శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ నేడు విడుదల అయ్యింది. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో హీరోయిన్ గా రీతూ వర్మ నటించడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం, టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా ఉండటం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో అమల అక్కినేని సైతం నటిస్తుండటం విశేషం.

ఈ చిత్రం లో శర్వానంద్ గిటారిస్ట్ గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, ప్రియదర్శి అతని స్నేహితుల్లా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళం లో కణం పేరిట విడుదల కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :