కొన్ని గంటల్లో ఒక్క క్షణం టిజర్ !
Published on Dec 2, 2017 1:08 pm IST

శ్రీరస్తు శుభమస్తు సినిమా తరువాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ‘ఒక్క క్షణం’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కు సిద్దంగా ఉంది. రేపు ఉదయం 10:30 కి ఒక్క క్షణం టిజర్ విడుదల కానుంది.

అవసరాల శ్రీనివాస్ & శిరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి రచయిత, చోటా కే ప్రసాద్ ఎడిటర్. టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమా అంద‌ర్నీ ఆకట్టుకోబోతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉన్నారు. ఈ సినిమాతో అల్లు శిరీష్ మరో హిట్ అనుకోబోతాడేమో చూద్దాం.

 
Like us on Facebook