“బలగం” కి మరోసారి సెన్సేషన్ రెస్పాన్స్!

“బలగం” కి మరోసారి సెన్సేషన్ రెస్పాన్స్!

Published on Jan 19, 2024 4:30 PM IST

టాలీవుడ్ నటుడు, కమెడియన్ వేణు దర్శకుడు గా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్ల లో, డిజిటల్ ప్రీమియర్ గా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బుల్లితెర పై కూడా తన సత్తా కొనసాగిస్తోంది. ఇటీవల ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో బలగం ను ప్రసారం చేయడం జరిగింది. ఈ చిత్రం 6.03 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

గతేడాది ఈ చిత్రం టీవీ ప్రీమియర్ గా టాప్ లో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పడు మరోసారి సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు