బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్

Published on Dec 17, 2023 10:58 PM IST

105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ 7 ఈరోజు గ్రాండ్ గా ముగిసింది. ఈ సీజన్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ఈ రోజు గ్రాండ్ ఫినాలే జరిగింది, ఈ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. రైతు బిడ్డ గా పేరుగాంచిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఉద్విగ్న క్షణాల మధ్య పల్లవి ప్రశాంత్‌ను చాంప్‌గా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చిన పల్లవి ప్రశాంత్ యూట్యూబర్‌ గా బాగా పాపులర్ అయ్యాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఎన్నో ఎత్తుపల్లాలు చూసాడు. అతని కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. ప్రేక్షకులు మొదటి నుండి అతని ఆటను ఇష్టపడటం ప్రారంభించారు. తద్వారా అతను ఇతరులతో పోల్చినప్పుడు ఎక్కువ ఓట్లు పొందాడు. మరో పోటీదారు అమర్‌దీప్ ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. శివాజీ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. రవితేజ, నిధి అగర్వాల్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, నేహా శెట్టి, సుమ కనకాల, ఆమె కుమారుడు రోషన్ కనకాల ఫైనల్ ఎపిసోడ్‌ కి వచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు