యూరప్ వెళ్లిన పవన్, త్రివిక్రమ్ !
Published on Oct 29, 2017 9:45 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న చిత్రం కొత్త షెడ్యూల్ కు సిద్ధమైంది. ఈ షెడ్యూల్ యూరప్ లో జరగనుంది. ఇందు కోసం పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ నిన్న రాత్రి యూరప్ బయలుదేరి వెళ్లారు. ఈ షెడ్యూల్ సుమారు 15 రోజుల పాటు నిర్విరామంగా జరగనుంది.

ఇందులో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నారు టీమ్. హీరోయిన్లు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉన్నా ఇంకా ఫైనల్ కాలేదు.

 
Like us on Facebook