తనలోని కొత్త టాలెంట్ ను చూపనున్న ‘పెళ్లి చూపులు’ స్టార్

తనలోని కొత్త టాలెంట్ ను చూపనున్న ‘పెళ్లి చూపులు’ స్టార్

Published on Aug 26, 2016 1:51 PM IST

Vijay-Devarakonda
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ‘పెళ్లి చూపులు’. ఈ చిత్రం నటించిన నటీనటులకు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా హీరో పాత్రలో వైవిధ్యంగా, రియలిస్టిక్ గా నటించిన విజయ్ దేవరకొండకు చేతి నిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం అతను చేస్తున్న మూడు సినిమాల్లో ‘ద్వారక’ చిత్రం కూడా ఒకటి.

ఆ చిత్రానికి సంబందించిన ట్రైలర్ రెండురోజులా క్రితం విడుదలై మంచి క్రేజ్ తెచ్చకుంది. దీంతో పాటు ఈ చిత్రంలో విజయ్ ఎప్పుడూ లేని విధంగా తనలోని డ్యాన్సింగ్ స్కిల్స్ ను కూడా బయటపెడట్టనున్నాడు. విజయ గతంలో తాను చేసిన రెండు సినిమాల్లో ఎక్కడా డ్యాన్సులు చేయలేదు. కాబట్టి విజయ్ అభిమానులకు ఈ ద్వారక చిత్రం అతనిలోని కొత్త టాలెంట్ ను పరిచయం చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు