ఫోటో మూమెంట్ : ఎనర్జిటిక్ బాలయ్యతో మంచువారబ్బాయి.!

Published on Oct 3, 2021 5:00 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ లో అంతా “మా” ఎన్నికలు(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హీట్ తో గరంగరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ మరియు హీరో మంచు మనోజ్ ల ప్యానెల్ నడుమ రసవత్తర పోటీ ఉండడం కన్ఫామ్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ ఎన్నికల బిజీలో మంచు విష్ణు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ను కలవడం జరిగింది.

ఈ మా ఎలక్షన్ లో సపోర్ట్ ఇచ్చినందుకు నటసింహం బాల అన్నకు థాంక్స్ చెబుతున్నాను. మీరు నా వెనుక ఉండడం అదృష్టంగా భావిస్తున్నాని మంచి ఎనర్జిటిక్ ఫోటోలే షేర్ చేసాడు. ఇద్దరూ ఎదురెదురు నిల్చొని ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నట్టుగా సైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో బాలయ్య లుక్ కూడా అఖండ నుంచి మారినట్టు అనిపిస్తుంది. మొత్తానికి దీనితో ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :