ఫోటో మొమెంట్ : మాస్టర్ బ్లాస్టర్ తో మెగాపవర్ స్టార్

Published on Feb 11, 2023 5:00 pm IST


టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC 15 మూవీ చేస్తోన్న సంగతి మనకి అందరికీ తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే విషయం ఏమిటంటే, దాదాపుగా పదేళ్ల విరామం తరువాత మన భారతదేశంలో తొలి మోటార్ స్పోర్ట్ ఈవెంట్ ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ మొత్తం 16 రేసుల్లో భాగంగా రేస్ 4 కోసం హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ప్రాంతం సుందరంగా ముస్తాబైంది.

మొత్తం ఇందులో పలు దేశాలకు చెందిన 11 టీములు, 22 మంది డ్రైవర్స్ పార్టిసిపేట్ చేయనున్నారు. కాగా ఈ గ్రాండ్ రేసింగ్ ఈవెంట్ కోసం యావత్ హైదరాబాద్ వాసులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుండగా పలువురు సెలెబ్రిటీస్ సైతం ఇది చూసేందుకు హాజరయ్యారు. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి దీనిని ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఈ రేసింగ్ అందరిలో ఎంతో మంచి ఉత్సాహాన్ని నింపుతోంది.

సంబంధిత సమాచారం :