అరవిందలో అరవింద పాత్ర అదేనట !

Published on Sep 16, 2018 10:51 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ విడుదలకు సమయం దగ్గర పడుతుంది. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ హైద్రాబాద్లో జరుగుతుంది. ఇక నిన్న విడుదలైన ఈ చిత్రంలోని ‘అనగనగ’ అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఈ చిత్రంలో వీడియో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారట.

విదేశాల్లో వుంటూ డాక్యుమెంటరీ చిత్రీకరించేందుకు పూజా రాయలసీమ లో అడుగు పెడుతుందట. ఆ తరువాత జరిగే పరిణామాలు తెలియాలంటే చిత్రం విడుదలయ్యేవరకు వేచి చూడాలి. ఇక ఈచిత్రంలో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుందట. సునీల్- పూజా మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా వుంటాయని సమాచారం. ఇక ఈ చిత్రం కోసం ఆమె మొదటిసారిగా తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెపుతుంది.

ఈనెల 20న ఈచిత్ర ఆడియోను విడుదలచేయనున్నారు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :