మెగా డాటర్ సినిమాకి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ !
Published on Jun 13, 2018 1:42 pm IST

‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం రెండో సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేస్తున్నారు. పాకెట్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ సమర్పిస్తోంది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రానికి ‘హ్యాపీ వెడ్డింగ్’ ఆనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో హీరోగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందివ్వనుండగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. ఈ సినిమాలో నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook