ప్రభాస్ పుట్టినరోజు అభిమానులకు మరింత స్పెషల్ కానుంది !
Published on Oct 17, 2017 11:03 am IST


‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా కావడం వలన ‘సాహో’ పట్ల జాతీయ స్థాయి క్రేజ్ నెలకొని ఉంది. అభిమానులైతే కొత్త లుక్ లో ఉన్న ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా, సినిమా ఎలా ఉంటుందో అనే ఆలోచనల్లో తేలిపోతున్నారు. అందుకే వాళ్ళ కోసమే అన్నట్టు ప్రభాస్ ఈ నెల 23న తన పుట్టినరోజు సందర్బంగా పలు సప్రైజులు ప్లాన్ చేశారు.

వాటిలో భాగంగా 22న రాత్రి ‘సాహో’ కు సంబందించిన మేకింగ్ వీడియో, రీసెంట్ గా జరిపిన ఫోటోషూట్ నుండి సినిమా స్టిల్స్, వాటితో పాటు అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ చేసే ప్రసంగానికి సంబందించిన వీడియోను రిలీజ్ చేయనున్నారు. మరోవైపు అభిమానులు కూడా అదే రోజున భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాల్ని ప్లాన్ చేశారు. దీంతో ప్రభాస్ పుట్టినరోజు అభిమానులకు మరింత సాధారణంగా కంటే మరింత స్పెషల్ కానుంది.

 
Like us on Facebook