ప్రభాస్ ఫేవరేట్ దర్శకుడు రాజమౌళి కాదట !
Published on Apr 10, 2017 8:55 am IST


ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ వీరిద్దరిదీ చాలా గాఢమైన అనుబంధం. ఒకే సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కలిసి ప్రయాణం చేశారు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో వారి మధ్య ఎక్కడా ఒడిదుడుకులనేవే రాలేదు. రాజమౌళి కలకు ప్రభాస్ వెల కట్టలేని తోడ్పాటునందిస్తే, ప్రభాస్ ను జాతీయ స్థాయి నటుడ్ని చేశాడు రాజమౌళి. కాబట్టి ప్రభాస్ కు ఫెవరెట్ దర్శకుడు రాజమౌళియేనని అందరూ అనుకుంటారు. కానీ ప్రభాస్ కు మాత్రం రాజమౌళి కన్నా ఇష్టమైన దర్శకులు మరో ఇద్దరున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.

నిన్న సాయంత్రం చెన్నైలో జరిగిన బాహుబలి – 2 తమిళ వెర్షన్ ఆడియో వేడుకలో ప్రభాస్ ను మీకిష్టమైన దర్శకుడెవరని అడగ్గా నాకు రాజమౌళి కన్నా మణిరత్నం, బాపు గార్లంటే చాలా ఇష్టం. ఎవరైనా ఒకరి పేరే చెప్పమంటే మణిరత్నంగారి పేరే చెబుతాను. ఆయనకు నేను వీరాభిమానిని. ఈ సంగతి రాజమౌళికి కూడా తెలుసని నవ్వుతూ అన్నారు. ప్రభాస్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. బాహుబలి 2 ఈ ఏప్రిల్ నెల 28న విడుదలకానుండగా ప్రభాస్ సుజీత్ డైరెక్షన్లో కొత్త చిత్రాన్ని చేస్తున్నాడు.

 
Like us on Facebook