ఇంగ్లీష్ లో కూడా ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ …. కానీ ?

Published on Mar 25, 2023 12:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ సలార్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా విజయ్ కిరాగందూర్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ మూవీ ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. కానీ సాంగ్స్ ని మినయించి ఇంగ్లీష్ లో డబ్ కానున్న ఈ మూవీ తెలుగు వర్షన్ తో పోలిస్తే అరగంట నిడివి తేడా ఉంటుందట. కాగా రాబోయే మరికొన్ని రోజుల్లో సలార్ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రిలీజ్ చేయనున్నారు యూనిట్ సభ్యులు.

సంబంధిత సమాచారం :