‘ఇజం’ కోసం పాట రాస్తున్న ‘పూరి జగన్నాథ్’

ism
టాలీవుడ్ దర్శకుల్లో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది ‘పూరీ జగన్నాథ్’. దర్శకత్వమేగాక ఈయనకు రచయితగా కూడా మంచి పేరుంది. సినిమాకి అవసరమైతే డైలాగులు, పాటలు కూడా రాస్తుంటాడు పూరి. తాజాగా ఆయన ‘కళ్యాణ్ రామ్’ హీరోగా ‘ఇజం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం పూరి పాత రాస్తున్నారు. అది ఏ సందర్భంలో రాస్తున్నారు, ఎలాంటి పాట రాస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ స్వయంగానిర్మిస్తున్న ఏ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.