న్యూ ఇయర్ కి సూపర్ స్ట్రాంగ్ గా పుష్ప, శ్యామ్ సింగరాయ్…నైజాం లో భారీ వసూళ్లు!

Published on Jan 2, 2022 5:00 pm IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని భారీ వసూళ్లను రాబడుతోంది. కొత్త సంవత్సరం రోజున ఈ చిత్రం నైజాం ప్రాంతంలో 1.2 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడం తో పుష్ప లాంగ్ రన్ లో భారీ వసూళ్ల తో ముగిసే అవకాశం కనిపిస్తోంది.

అదే విధంగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం అదే దూకుడు ను కొనసాగిస్తుంది. ఈ చిత్రం న్యూ ఇయర్ రోజున నైజాం ప్రాంతంలో కోటి రూపాయల వసూళ్ల ను సొంతం చేసుకుంది. ఈ తరహా వసూళ్లను రాబడుతూ ఉండటం తో లాంగ్ రన్ లో మరింత ఎక్కువగా వసూలు చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి ఆక్యూపెన్సీ తో దూసుకు పోతున్న ఈ చిత్రాలు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఇతర భాషల్లో సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం :