‘మహానటి’ సన్నివేశాన్ని రిపీట్ చేసిన సమంత !
Published on May 23, 2018 6:15 pm IST

‘మహానటి’ చిత్రాన్ని చుసిన ప్రేక్షకులకు సినిమాలో సావిత్రి పాత్రలోని కీర్తి సురేష్, దర్శకుడు కెవి రెడ్డి పాత్రలోని క్రిష్ కు మధ్య జరిగే విషాద సన్నివేశ చిత్రీకరణ సీన్ ఖచ్చితంగా చాలా కాలంపాటు గుర్తుండిపోతుంది. ఈ ఒక్క సన్నివేశం నటి సావిత్రిగారు ఏ స్థాయి నటో వివరించింది. ఇప్పుడు ఇదే తరహా సన్నివేశాన్ని హీరోయిన్ సమంత రిపీట్ చేశారట.

ప్రస్తుతం ఆమె ‘యు టర్న్’ తెలుగు, తమిళ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈరోజు సమంతతో పాటు షూట్లో పాల్గొన్న నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు యాక్షన్ అనగానే సమంత వెంటనే ఏడవటం మొదలుపెట్టేసింది. కనీసం గ్లిజరిన్ కూడ లేకుండా కన్నీళ్లు కార్చేసింది అంటూ సమంత నటనా ప్రతిభను వివరించారు.

ఈ చిత్రాన్ని ‘యు టర్న్’ కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. సమంత ఎంతో ఇష్టపడి చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook