డ్రగ్స్ పాయింట్ తో వస్తున్న యువ హీరో చిత్రం !
Published on Oct 26, 2017 2:07 pm IST


ఈ మధ్య డ్రగ్స్ వివాదం చాలా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చాలా మంది నటీ, నటులు దర్శకులు ఈ వివాదంలో చిక్కుకున్నారు. నిజానికి డ్రగ్స్ తీసుకున్నవారు ఎవరు అనే స్పష్టమైన వార్త లేనప్పటికీ చాలా మందిని పిలిపించి విచారించారు ప్రత్యేక బృందం. తాజాగా పలు భాషల్లో ఈ విషయానికి సంభందించి సినిమాలు కూడా వచ్చాయి. ఆ తరహాలోనే త్వరలో తెలుగులో ఈ పాయింట్ ని లైట్ గా టచ్ చేస్తూ సినిమా రాబోతోందని తెలుస్తోంది.

అదే రాజ్ తరుణ్ హీరోగా, మలయాళీ హీరోయిన్ గాయత్రి సురేష్ నటిస్తున్న ‘లవర్’. ఈ సినిమా ఈ మధ్యే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, అనిష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఒక లవ్ స్టొరీ అయినప్పటికీ హీరో డ్రగ్స్ కు సంభందించి ఇన్వెస్టిగేషన్ చేస్తాడని సమాచారం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంభంచింది ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook