సూర్యతో సినిమాను కన్ఫర్మ్ చేసిన రకుల్ ప్రీత్ !
Published on Nov 12, 2017 4:10 pm IST

తెలుగు పరిశ్రమలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ తమిళ ఇండస్ట్రీపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే కార్తి యొక్క ‘తీరన్ అదిగారం ఒండ్రు’ తెలుగులో ‘ఖాకి’ చిత్రంలో నటించిన ఆమె త్వరలోనే అతని సోదరుడు సూర్య చిత్రంలో కూడా నటించే అవకాశముందని గతంలో వార్తలోచ్చాయి.

అయితే ఈ వార్తలపై ఇన్నాయి రోజులు సైలెంట్ గానే ఉన్న రకుల్ తాజాగా జరిగిన ‘ఖాకి’ ప్రమోషనల్ ఈవెంట్లో నోరు విప్పి సూర్య సినిమాలో నటిస్తున్నానంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ చిత్రాన్ని సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేయనున్నారు. డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాష్ బాబులు నిర్మించనున్న ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది జనవరి నుండి మొదలుకానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook