సైంటిస్ట్ గా మారబోతున్న రానా !


లండన్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే చిత్రం ద్వారా రానా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ విజిల్. ఇది ఓ పెద్ద ఓడ నేపథ్యంలో సాగె కథ. ఈ చిత్రం 2018 లో సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సైంటిస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. విజిల్ ఓడ 1888 లో అదృశ్యమైంది. 700 మంది ప్యాసింజర్లతో సౌరాష్ట్ర నుంచి బయలు దేరిన ఈ కూడా కనిపించకుండా పోయింది. ఆ ఓడ అదృశ్యం కావడానికి కారణాలేంటి అని పరిశోధించి సైంటిస్ట్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు.