నవంబర్ కి రానున్న రానా కొత్త సినిమా ఫస్ట్ లుక్ !
Published on Oct 24, 2017 5:57 pm IST


‘బాహుబలి’ తో జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చుకున్న రానా అందరు హీరోలకంటే భిన్నంగా కథల్ని ఎంచుకుంటూ మంచి అభిరుచి గల నటుడనే పేరు తెచ్చుకున్నాడు. ఇది వరకే సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్లో ‘ఘాజి’ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న ఆయన ఇప్పుడు కూడా అలాంటి భిన్నమైన నైపథ్యం కలిగిన సినిమానే ఎంచుకున్నారు. అది కూడా 1945ల కాలంలో జరిగే కథ కావడం విశేషం. అందులోను ప్రేమ కథగా ఉండటం మరొక విశేషం.

ఈ సినిమా కోసం రానా పూర్తిగా తన లుక్ మార్చేసి కొత్త లుక్ లోకి మారిపోయారు. దాదాపు కొన్నేళ్ల పాటు పూర్తి గడ్డంలోనే కనబడిన ఆయన ఈ చిత్రం కోసం అది కాస్త తొలగించి సోల్జర్ లా కొత్తగా కనిపిస్తున్నారు. సత్యశివ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ నవంబర్ నెలలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని రానా స్వయంగా ప్రకటించారు. సత్యరాజ్ ఒక కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో రానాకు జోడీగా రెజినా నటిస్తోంది.

 
Like us on Facebook