తమిళంలో కూడా రిలీజ్ కానున్న రానా పొలిటికల్ డ్రామా !
Published on Jun 4, 2017 8:08 pm IST


‘బాహుబలి’ సిరీస్ తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా తన వైవిధ్యమైన పంథాలో భాగాంగానే తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేస్తున్నారు. దాదాపు ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ‘బాహుబలి-2’ సాధించిన విజయంతో తెలుగు సినిమాలు అందులోను రానా, ప్రభాస్ ల సినిమాలాంటే తమిళ, హిందీ భాషల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

అందుకే రానా చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామాను తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రానా అభిమానులతో జరిపిన ట్విట్టర్ సంభాషణలో తెలపడం విశేషం. కాజల్ అగర్వాల్, క్యాథరిన్ థ్రెసలు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు, భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం యొక్క టీజర్ ను డా. రామానాయుడు జయంతి సందర్బంగా జూన్ 6న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook