“రంగ రంగ వైభవంగా” ఫస్ట్ లుక్ విడుదల

Published on Jan 24, 2022 6:19 pm IST

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా అనే ప్రేమకథతో రాబోతున్నాడు. ఆదిత్య వర్మ ఫేమ్ గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో నవ్వుతూ ఉండగా, అందాల నటి కేతికా శర్మ అయోమయంగా కనిపిస్తోంది. సంప్రదాయ వస్త్రధారణలో ఈ జంట చాలా అందంగా కనిపిస్తుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు కూడా ధృవీకరించబడింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :