ఛేజింగ్ సన్నివేశాల్ని పూర్తి చేసిన రామ్ చరణ్ !
Published on Dec 6, 2017 9:37 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటోంది. హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన వీలేజ్ సెట్లో ఇన్నాళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. అక్కడున్న విలేజ్ సెట్లో చరణ్ పై బైక్ ఛేజింగ్ సన్నివేశాల్ని షూట్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. 1985 కాలంలో సాగే గ్రామీణ ప్రేమకథగా ఉండనున్న ఈ సినిమాను సుకుమార్ ఎంతో ఖచ్చితత్వంతో రూపొందిస్తున్నారు. సమంత కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

 
Like us on Facebook