‘శ్రీరస్తు శుభమస్తు’కి హైలైట్‌గా ఆ ఇద్దరి క్యారెక్టర్స్

Srirastu-Subhamastu
అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోతో పాటు ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అతడి గత చిత్రాల్లానే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఇక అదేవిధంగా సినిమాలో రెండు క్యారెక్టర్ అందరినీ కట్టిపడేసేలా ఉంటాయని టీమ్ చెబుతూ వస్తోంది.

ఆ రెండు క్యారెక్టర్సే రావు రమేష్, ప్రకాష్ రాజ్ చేసినవి. సినిమాకు కీలకమైన ఈ రెండు పాత్రల్లో వారిద్దరి నటన ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ప్రకాష్ రాజ్, రావు రమేష్.. ఇద్దరూ నటనలో తామేంటో నిరూపించుకున్న వారే కావడంతో వారిద్దరి వల్ల సినిమా స్థాయి పెరిగిందని దర్శకుడు పరశురాం తెలిపారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు.