తన బలాన్ని నమ్ముకుని రాబోతున్న రవితేజ
Published on Jun 13, 2017 9:01 am IST


2015 లో వచ్చిన బెంగాల్ టైగర్ తరువాత రవితేజ నుంచి మరో చిత్రం రాలేదు.అంత గ్యాప్ ఇక తీసుకోకుండా రవితేజ వరుసగా రెండు చిత్రాలను ప్రారంభించాడు. టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ చిత్రాలను రవితేజ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా టచ్ చేసి చూడు చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో రవితేజ మార్క్ కామెడీ హైలైట్ కానుందని సమాచారం. జోష్ తో కూడిన రవితేజ కామెడీ టైమింగ్ కు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. రవితేజ బలం కూడా అదే. రవితేజ ఈ చిత్రంలో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రచయిత నుంచి దర్శకుడిగా మారిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రాసి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీ ల నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 
Like us on Facebook