భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ‘రంగస్థలం 1985’!
Published on Nov 7, 2017 8:42 am IST

రామ్ చరణ్, సుకుమార్ ల కలయికలో రూపొందుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రం పై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతేగాక సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని కూడా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంచనాల వలనే చిత్రం యొక్క నాన్ థియేట్రికల్ భారీ స్థాయిలో జరిగింది.

సినిమా యొక్క తెలుగు శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులుసుమారు రూ.20 కోట్లకు పైగానే అమ్ముడవగా హిందీ శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ హిందీ ఛానెల్ రూ. 10.50 కోట్లకు కొనుగోలు చేయగా ఆడియో హక్కులు రూ.1.5 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ మొత్తం కలిపితే దగ్గర దగ్గర రూ. 35 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తేలింది. మరి నాన్ థియేట్రికల్ హక్కులే ఈ స్థాయిలో అమ్ముడైతే థియేట్రికల్ బిజినెస్ భారీ మొత్తంలోనే జరిగే అవకాశముంది.

మైత్రి మూవీస్ నిర్మాణంలో సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా సమంత నటిస్తోంది.

 
Like us on Facebook