ఓటిటిలో తమన్నా “బబ్లీ బౌన్సర్” రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఓటిటిలో తమన్నా “బబ్లీ బౌన్సర్” రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Jul 20, 2022 1:01 PM IST

ఇప్పుడు థియేటర్స్ లో మాత్రమే కాకుండా ఓటిటి లో కూడా పలు సినిమాలు నేరుగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే వాటితో పాటుగా వెబ్ సిరీస్ లు కొత్త సినిమాల రిలీజ్ లు కూడా ఓటిటి లో వెను వెంటనే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా ఓటిటి లో డైరెక్ట్ గా రిలీజ్ ఓ సినిమా రెడీ అయ్యింది.

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెయిన్ లీడ్ గా నటించిన హిందీ చిత్రం “బబ్లీ బౌన్సర్” నేరుగా డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం హిందీ సహా తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా తమన్నా తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అనౌన్స్ చేసింది. మరి ఈ చిత్రానికి స్టార్ స్టూడియోస్ మరియు జంగ్లీ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు