నవంబర్‌లోనే ‘2.0’ ఫస్ట్‌లుక్..!
Published on Oct 10, 2016 5:28 pm IST

robo2
సూపర్ స్టార్ రజనీ కాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రభంజనం ‘రోబో’కి సీక్వెల్‌గా ప్రస్తుతం ‘రోబో 2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాకు శంకర్ ‘2.0’ అన్న టైటిల్‌ను తెలుగు, తమిళం, హిందీ మూడు భాషలకూ ఫిక్స్ చేశారు. ఇక అదేవిధంగా 2.0 లోగో, ఫస్ట్‌లుక్ కూడా ఇప్పటికే సిద్ధం చేసేశారట. అయితే వీటిని నవంబర్ నెలలోనే విడుదల చేయాలని టీమ్ సన్నాహాలు చేసుకుంటోంది.

నవంబర్ 20న ముంబైలో భారీ ఎత్తున నిర్వహించే ఈవెంట్‌లో 2.0 ఫస్ట్‌లుక్ విడుదల చేస్తారట. దీంతో దీపావళికి ఫస్ట్‌లుక్ వస్తుందని ఆశించిన వారికి మరో నెల రోజుల పాటు ఎదురుచూపులు తప్పేలా లేదు. ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook