అక్కడ 250 కోట్ల వైపుకి పరుగులు తీస్తున్న “ఆర్ఆర్ఆర్”

Published on Apr 12, 2022 12:00 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వడం మాత్రమే కాకుండా, ప్రాఫిట్స్ లోకి వస్తోంది.

ఈ చిత్రం బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సోమవారం నాడు మరో 3.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పటి వరకూ 235 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ తరహా లో బాహుబలి 2 తర్వాత ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించడం విశేషం. త్వరలో నే అక్కడ 250 కోట్ల రూపాయల మార్క్ ను ఈజీ గా టచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక ఈ చిత్రం లాంగ్ రన్ లో ఏ తరహా వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :