‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్ రెడీ ?

Published on Sep 27, 2021 10:50 am IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పోస్ట్ ఫోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే, అక్టోబర్ 22 నుండి థియేటర్లు తిరిగి తెరవడానికి అనుమతిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది . ఇప్పటికే 2022 సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ కాబట్టి, ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రిలీజ్ కాదు.

సంబంధిత సమాచారం :