‘రారండోయ్ వేడుక చూద్దాం’ రెండు రోజుల వసూళ్ల వివరాలు !
Published on May 28, 2017 5:23 pm IST


అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి నుండి పాజిటివ్ టాక్ ఉండటం, కుటుంబ కథా చిత్రం కావడంతో సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. దీంతో చిత్రం ఏపి, తెలంగాణల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

చిత్ర పిఆర్ టీమ్ వివరాల ప్రకారం ఏరియాల వారీగా వసూళ్లను చూసుకుంటే శుక్ర, శనివారాలకు కలిపి కీలకమైన నైజాం ప్రాంతంలో రూ. 1.96 కోట్లు రాబట్టిన ఈ చిత్రం సీడెడ్లో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, వెస్ట్ గోదావారిలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 94 లక్షలు కలిపి మొత్తంగా రూ. 5. 9 కోట్లను వసూలు చేసింది. వేసవి సెలవలు కావడంతో ఈ కలెక్షన్లు ఇంకొన్నిరోజులు ఇలాగే స్టడీగా కొనసాగే అవకాశముంది.

 
Like us on Facebook