డబ్బులు కోసం కూరగాయలు అమ్మిన సమంత !

Published on Sep 1, 2018 12:20 pm IST

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత డబ్బులు కోసం చెన్నైలోని ఓ సాధారణ దుకాణంలో కూరగాయలని అమ్మారు. అసలు విషయంలోకి వెళ్తే ప్రత్యూష చారిటబుల్‌ ట్రస్ట్‌ పెట్టి సమాజ సేవ చేస్తూ.. సమంత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా గుండె సంబంధిత వ్యాధులకు గురైన చిన్నారులకి ట్రీట్మెంట్ అందించడానికి డబ్బులను సేకరిస్తున్నారు.

కాగా గురువారం సాయంత్రం చెన్నైలోని ట్రిప్లికేన్‌లోని జామ బజార్‌కు వచ్చారు. ఆమె రాకతో జనం చుట్టూ చేరారు. సమంత మాత్రం కూరగాయలు తూకం వేస్తూ అమ్ముతుండగా మొదట ఆశ్చర్యపోయిన జనం తర్వాత విషయం తెలుసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి సమంత దగ్గర కూరగాయలు కొన్నారు. ఏమైనా అక్కినేని సమంత ఇలా సేవ కార్యక్రమాలను చేస్తుండటం పట్ల అక్కినేని అభిమానులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :