పుష్ప: సమంత స్పెషల్ సాంగ్‌కి అదిరిపోయే టైటిల్..!

Published on Dec 3, 2021 2:55 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రంలో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 5వ పాటగా విడుదల కానున్న ఈ పాటకి అదిరిపోయే టైటిల్‌ను పెట్టినట్టు తెలుస్తుంది. “ఉ అంటావా ఊ అంటావా” అంటూ సాగే ఈ మాస్ స్పెషల్ సాంగ్ అందరినీ ఆకట్టుకోడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :