“సర్కారు వారి” నుంచి రాబోయే మాస్ సాంగ్ ఎలా ఉంటుందో రివీల్ చేసిన రచయిత.!

Published on May 1, 2022 7:02 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ తో ఫస్ట్ టైం జత కట్టి నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ కోసం ప్రత్యేకంగా మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ గ్యాప్ ని మేకర్స్ ఎక్కడ లేని హైప్ తో ఫిల్ చేస్తుండగా ఈ సినిమా నుంచి ఇంకా రెండు సాంగ్స్ బాకీ ఉన్నాయని సంగీత దర్శకుడు థమన్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు.

అయితే ఈ సాంగ్స్ లో ఒకటి మాస్ సాంగ్ కూడా ఉండగా దానిని సహా ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఆ పాట ఎలా ఉంటుందో లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చెయ్యడం ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమాలో అన్ని పాటలు కూడా సినిమా నేపథ్యంకి తగ్గట్టుగా ఉంటాయని కానీ ఈ సినిమా కొంచెం సినిమా నేపథ్యానికి దూరంగా మాస్ కి బాగా దగ్గరగా ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ మహేష్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో వారికి మాంచి ట్రీట్ ఇచ్చేలా ఉంటుంది అని తెలిపారు. అలాగే ఈ సాంగ్ మరో రెండు మూడు రోజుల్లో బహుశా రిలీజ్ చెయ్యొచ్చని మరో క్లారిటీ ఇచ్చేసారు. మొత్తానికి అయితే సర్కారు వారి ఆల్బమ్ నుంచి మాస్ చార్ట్ బస్టర్ రాబోతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :