ఫర్జీ సీజన్ 2 రిలీజ్ పై క్లారిటీ!

ఫర్జీ సీజన్ 2 రిలీజ్ పై క్లారిటీ!

Published on Jan 31, 2024 6:25 PM IST

షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి మరియు రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో, ప్రముఖ దర్శక ద్వయం రాజ్ అండ్ డికె దర్శకత్వంలో తెరకెక్కిన ఫర్జీ ఫిబ్రవరి 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సీజన్ 1 ఎండింగ్ లో, మేకర్స్ సెకండ్ సీజన్ పై క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుండి, రెండవ సీజన్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులతో ఇంటరాక్టివ్ సెషన్‌లో, రాశి ఖన్నా రెండవ సీజన్ గురించి పెద్ద అప్డేట్‌ను అందించింది.

ఆమె మాట్లాడుతూ, మా డైరెక్టర్ అయిన రాజ్ సర్‌ ను అడగగా, వచ్చే ఏడాది ప్రారంభంలో ఫర్జీ 2 షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన నాకు చెప్పారు. కాబట్టి బహుశా 2025 చివరి నాటికి ఫర్జీ 2 వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. ఈ వెబ్ సిరీస్ లో తన తాతగారి ప్రెస్‌ను కాపాడుకోవడానికి నకిలీ డబ్బు సంపాదించడం ప్రారంభించిన ఆర్టిస్ట్ గురించి. ఇది అతన్ని పెద్ద గందరగోళంలో పడేలా చేస్తుంది. ఫర్జీ షాహిద్ కపూర్ యొక్క OTT అరంగేట్రం. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్‌లో కే కే మీనన్, భువన్ అరోరా, జాకీర్ హుస్సేన్, చిత్తరంజన్ గిరి, అమోల్ పాలేకర్, రెజీనా కసాండ్రా మరియు కావ్యా థాపర్ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు