“జయమ్మ, చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ” లిరికల్ వీడియో ను రిలీజ్ చేసిన రాజమౌళి!

Published on Jan 16, 2022 2:46 pm IST

ప్రముఖ యాంకర్ సుమ జయమ్మ పంచాయతీ చిత్రం తో సినీ పరిశ్రమ లోకి నటి గా అడుగు పెడుతున్నారు. విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయ్యింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ పాటను విడుదల చేశారు.

జయమ్మ, చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ లిరికల్ వీడియో ను రాజమౌళి విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాయగా, శ్రీ కృష్ణ ఈ పాటను పాడటం విశేషం. ఈ చిత్రాన్ని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :