కొత్త ప్రాజెక్టుకి సైన్ చేసిన మోహన్ బాబు !
Published on May 30, 2017 8:44 am IST


విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ప్రస్తుతం కొత్త సినిమాను మొదలుపెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చివరగా ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాలో నటించిన ఈయన కాస్త గ్యాప్ తీసుకుని ఒక సినిమాకి ఓకే చెప్పారని తెలుస్తోంది. రచయిత డైమండ్ రత్నబాబు చెప్పిన ఒక కథ బాగా నచ్చడంతో మోహన్ బాబు సినిమా చెయ్యడానికి సిద్దమయ్యారట.

ఈ కథలో ఆయన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, అందుకే సినిమాను వెంటనే మొదలుపెట్టాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాను ‘పెళ్ళైన కొత్తలో’ దర్శకుడు మదన్ డైరెక్ట్ చేయనున్నారట. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook