‘అర్జున్ రెడ్డి’ని వదులుకున్నందుకు కాస్త బాధపడ్డాను – శర్వానంద్


యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘మహానుభావుడు’ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. పెద్ద సినిమాలని సైతం తట్టుకుని చిత్రం ఈ దసరానికి పరిపూర్ణమైన హిట్ గా నిలవడంతో శర్వానంద్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతేగాక సినిమా కమర్షియల్ గా కూడా వర్కవుట్ అవడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారాయన. ఇక ఈ మధ్య తెలుగులో సంచలనం విజయంగా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ చిత్ర అవకాశం చేజారిపోవడం పట్ల కాస్త బాధను వ్యక్తం చేశారు శర్వా.

ఆ కథను సందీప్ ముందు తనకే చెప్పాడని కానీ నిర్మాతల వద్దకు పంపితే వారు వద్దన్నారని, అందుకే ఆ సినిమా చేయలేకపోయానని, అందుకు కొంత బాధగానే ఉందని చెప్పిన శర్వానంద్ సినిమా చూశాక దాన్ని విజయ్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరని, ఇండస్ట్రీకి మరొక కొత్త హీరో దొరికాడని ఫీలింగ్ కలిగిందని చెప్పారు. అలాగే తాను ఫార్ములా తరహా సినిమా చేస్తే జనం చూడరని, అందుకే కొత్తగా ఉండేలా చేయడానికే ప్రయత్నిస్తానని అన్నారు.