రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘స్నేహమేరా జీవితం’ !
Published on Nov 12, 2017 2:40 pm IST

నటుడు శివ బాలాజీ స్వయంగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘స్నేహమేరా జీవితం’. ఇందులో శివ బాలాజీతో పాటు రాజీవ్ కనకాల కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. స్నేహం నైపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ కు మంచి స్పందన లబోస్తోంది. ఈ ట్రైలర్ ను ఇటీవలే దుబాయ్ లో విడుదల చేశారు. గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం పూర్తై చాలా రోజులైనా కొన్ని ఇబ్బందుల కారణంగా విడుదలకు రాలేదు.

అందుకే చిత్ర యూనిట్ ఇకపై ఆలస్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ నెల 17వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మహేష్ ఉప్పుటూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందివ్వగా ధరణి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుని కెరీర్లో మరోసారి నిలదొక్కుకోవాలి అనుకుంటున్నారు శివ బాలాజీ.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook