కాస్టింగ్ కౌచ్ పై కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడిన హీరోయిన్ !
Published on Nov 5, 2017 3:26 pm IST

తమిళ హీరోయిన్లలో ఆండ్రియాది కొంత భిన్నమైన శైలి. ఎన్ని విమర్శలు ఎదురైనా తనకు నచ్చింది చేస్తూ, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందామె. తాజాగా ఒక కార్యక్రమంలో కాస్టింగ్ కోచ్ ప్రస్తావన రాగా ఏమాత్రం తడబడకుండా కుండ బద్దలుకొట్టినట్టు తన అభిప్రాయాన్ని చెప్పారు ఆండ్రియా.

ఇది ప్రతి పరిశ్రమలోనూ ఉండేదే. నాకైతే ఇప్పటి వరకు అలాంటి అనుభవం ఎదురుకాలేదన్న ఆమె ఏ హీరో, ఏ నిర్మాత తనను ఇబ్బందిపెట్టలేదని, ఒకవేళ తనకే అలాంటి అనుభవం ఎదురైతే ఖచ్చితంగా వ్యతిరేకిస్తానని అన్నారు. అంతేగాక హీరోయిన్ అయినా, ఎవరైన సరే ఆడవాళ్లకు ఇష్టం లేకుండా వారిని బలవంత పెట్టే హక్కు మగవారికి లేదని గట్టిగా సమాధానమిచ్చారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook