‘దువ్వాడ జగన్నాథం’ కోసం స్పెషల్ సెట్!

31st, January 2017 - 11:29:29 PM


స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది ‘సరైనోడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి స్టార్ హీరోల రేసులో మరింత ముందుకెళ్లి తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్నాడు. ఆ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో జతకట్టి ‘దువ్వాడ జగన్నాథం’ పేరుతో కొత్త సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దానికి తగ్గట్టే సినిమా కుడా పూర్తి వైవిధ్యంగా ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడే ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సెట్టింగ్ వేశారట. సంగీత్ కార్యక్రమం తరహాలో ఉండే ఈ సెట్లో చిత్రీకరిస్తున్న పాట సినిమా మొత్తానికి స్పెషల్ గా నిలుస్తుందని, ఫ్యాన్సుకు కూడా మంచి థ్రిల్ ఇస్తుందని, అందుకే దానికి సంబందించిన ఫోటోలు ఏవీ బయటకు లీక్ కాకూండా చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనుండగా ఎస్. రవీంద్ర ఆర్ట్ డైరెక్షన్ భాద్యతలు నిర్వహిస్తున్నారు.