స్పైడర్ ఉత్తరాంధ్ర కలెక్షన్స్ రిపోర్ట్!
Published on Oct 3, 2017 4:47 pm IST


సూపర్ స్టార్ మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా రిలీజ్ అయ్యి మొదటి వారం పూర్తి చేసుకొని సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది. తాజా రిపోర్ట్ ప్రకారం 6 రోజుల్లో ఉత్తరాంధ్ర లో స్పైడర్ కలెక్షన్స్ 3.71 కోట్లు క్రాస్ చేసింది. అయితే రైట్స్ ని భారీ రెట్లుకి కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్స్ కి ఈ కలెక్షన్స్ ఫుల్ షాకింగ్ గానే ఉన్నాయి.

సినిమా డిజపాయింట్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి, రెండు రోజులు కలెక్షన్స్ భాగున్న క్రమంగా డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా మీద డిస్టిబ్యూటర్స్ కి భారీ నష్టం తప్పేలా లేదు. మహేశ్ కెరియర్ లో బ్రహ్మోత్సవం తర్వాత మరో సారి ఈ సినిమా డిస్టిబ్యూటర్స్ కి నష్టాలు మిగిల్చింది .

 
Like us on Facebook