విలన్ లుక్ లో ఇంప్రెస్ చేస్తున్న శ్రీకాంత్ !
Published on Jul 31, 2017 6:13 pm IST


నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘యుద్ధం శరణం’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ బాగుండటంతో పాటు అందులోని మరొక ఆసక్తికరమైన అంశం కూడా బాగా ఆకట్టుకుంటోంది. అదే విలన్ పాత్ర పోషించిన సీనియర్ నటుడు శ్రీకాంత్ మేకోవర్. ముందుగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కొద్దిగా మాత్రమే రివీల్ చేసిన శ్రీకాంత్ లుక్ ను ఈ టీజర్లో ఇంకాస్త డీటైల్డ్ గా చూపించారు.

పూర్తిగా సాఫ్ట్ లుక్ ను వదిలి రప్ అండ్ టఫ్ లుక్ లో శ్రీకాంత్ ప్రామిసింగా ఉన్నాడు. అంతేకాకూండా డైరెక్టర్ ఇంటెంక్షనల్ గా శ్రీకాంత్ చేతి మీదున్న అహం బ్రహ్మాస్మి అనే టాటూని చూపిస్తూ అతని పాత్ర ఈగోతో నిండి ఎంత బలంగా ఉంటుందో హింట్ ఇచ్చాడు. దీంతో సినిమాపై ఇంకాస్త ఆసక్తి ఎక్కువవుతోంది. మరి పూర్తిస్థాయి విలన్ గా శ్రీకాంత్ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. ఫ్యామిలీ కమ్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు డైరెక్ట్ చేస్తుండగా వారాహి చలన చిత్రం బ్యానర్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

 
Like us on Facebook