ఒక పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు పెట్టిన దర్శకుడు !
Published on Jul 20, 2017 3:04 pm IST


స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు భారీ స్థాయి సెట్టింగ్స్ కూడా ఉంటాయి. నిర్మాత పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద ఇట్టే కనిపించేలా చేస్తారాయన. దాంతోనే సినిమాకు భారీ తనంతో పాటు హుందాతనం కూడా వస్తుంటుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న ‘జయ జానకి నాయక’ విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నారాయన.

ఈ సినిమా కోసం వైజాగ్ బీచ్ ప్రాంతంలో ఒక పాటను షూట్ చేస్తున్నారు. ఈ పాత కోసం ఒక పెద్ద సెట్టింగును రూపొందించారట. అక్షరాలా దీని విలువ రూ.3 కోట్ల రూపాయలని టాక్. దీన్నిబట్టి ఈ పాట సినిమాలో ఎలా కనిపిస్తుందో ఊహించవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానన్నీ ఆగష్టు 11న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook