ప్రొడ్యూసర్ గా బిజీ అవుతున్న స్టార్ డైరెక్టర్ !

Published on Feb 16, 2019 12:43 am IST

‘రంగస్ధలం’ తో ఇండస్ట్రీ హిట్ అందించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం మహేష్ 26 స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు. ఒకవైపు ఇది చేసుకుంటూనే మరో వైపు సహా నిర్మాత గా మారి వరుస సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈచిత్రం తో సుక్కు శిష్యుడు బుచ్చిబాబు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇక తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయిపోయాడు సుక్కు.

అయితే ఈసారి మెగా డాటర్ నిహారిక కోసం కథను సిద్ధం చేశాడట. ఆయన శిష్యుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తో కాని లేక అంజనా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :