ప్రత్యేక హోదాపై మాట్లాడుతూనే ఉంటానన్న స్టార్ డైరెక్టర్ !
Published on Mar 8, 2018 3:10 pm IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ప్రత్యేక హోదా హాట్ టాపిక్ గా నడుస్తున్న నైపథ్యంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నిన్న ట్విటర్ ద్వారా ‘నరేంద్రమోదీకి ప్రత్యేక హోదాను గుర్తుచేస్తూనే ఉండండి ఆయన్ను సంపూర్ణ వ్యక్తిగా మారేలా చూడండి’ అంటూ చురకలాంటి కామెంట్ చేశారు. దీనికి నెటిజన్లు కూడ తమ మద్దతును ప్రకటించంగా కొరటాల శివ తాజాగా మరొక ట్వీట్ చేశారు.

అందులో ‘ఒక ప్రకృతి విపత్తు సంభవిస్తే అందరం ఒకటిగా నిలబడతాం. ఇప్పుడు రాష్ట్రానికి అలాంటి విపత్తే సంభవించింది. కనుక పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఎలాంటి సంశయం, వేరే లెక్కలు లేకుండా నా మనసులోని బాధను బయటపెడుతున్నాను. ఇకపై కూడ ఇలాగే నా వేదనను వ్యక్తపరుస్తాను. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదు’ అన్నారు.

ఇకపోతే ఈయన మహేష్ బాబుతో కలిసి తెరకెక్కిస్తున్న ‘భరత్ అనే నేను’ కూడ ఫిక్షనల్ పొలిటికల్ డ్రామా కావడం విశేషం. ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 
Like us on Facebook