తన ఆరోగ్యం బాగానే ఉందంటున్న స్టార్ హీరో !
Published on Feb 27, 2018 10:57 am IST

గత రెండు రోజులుగా ప్రముఖ తమిళ నటుడు విశాల్ కు బిజీ షెడ్యూళ్ల వలన ఆరోగ్యం దెబ్బతిందని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలొచ్చాయి. ఇంకొందరైతే ఏకంగా ఆయన కాలిఫోర్నియా వెళ్లి వైద్యం చేయించుకున్నారని కూడ అన్నారు. కానీ ఇవన్నీ ఒట్టి గాలి వార్తలేనని తేల్చేశారు విశాల్.

కొద్దిసేపటి క్రితమే పుకార్లపై స్పందించిన ఆయన తన ఆరోగ్యం చాలా బాగుందని, తనకున్న మైగ్రైన్ సమస్య పట్ల జాగ్రత్త తీసుకుంటానని, త్వరలోనే అది కూడ నయమవుతుందని, మార్చి మొదటి వారానికల్లా షూటింగ్స్ లో పాల్గొంటానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ హీరో లింగుస్వామి దర్శకత్వంలో ‘సండకోజి 2’ చిత్రంలో నటిస్తున్నారు.

 
Like us on Facebook