ఓటిటిలో ఇప్పటికీ అదరగొడుతున్న చై “దూత”

ఓటిటిలో ఇప్పటికీ అదరగొడుతున్న చై “దూత”

Published on Dec 24, 2023 8:01 AM IST

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య అక్కినేని ఈ ఏడాదిలోనే అక్కినేని ఫ్యాన్స్ కి అయితే హిట్ ని అందించాడు. థియేటర్స్ లో తన కస్టడీ ఓకే అనిపించింది కానీ “దూత” గా మారి ఓటిటిలో సాలిడ్ డెబ్యూ ఇచ్చి వారికి హిట్ ని అందించాడు. మరి టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సాలిడ్ థ్రిల్లర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయగా ఈ సిరీస్ విడుదల రోజు నుంచే ఇంటెన్స్ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి అందుకుంది.

అంతే కాకుండా ప్రైమ్ వీడియోలో చాలా రోజులు పాటుగా ట్రెండింగ్ లో ఇండియా వైడ్ నిలిచిన ఈ చిత్రం లేటెస్ట్ గా ఒర్మాక్స్ లో కూడా ఇండియా వైడ్ గా నెంబర్ 1 సిరీస్ గా ఓటిటి లో ట్రెండ్ అవుతున్నట్టుగా తెలిపారు. దీనితో ఈ హ్యాపీ మూమెంట్ ని నాగ చైతన్య షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి అయితే దూత హవా మాత్రం ఓటిటిలో గట్టిగా ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు