ఇంట్రెస్టింగ్ గా “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీజర్.!

Published on Jan 22, 2022 4:43 pm IST

మన టాలీవుడ్ మరో మ్యాచో హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మరో ఆసక్తికర చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. గత కొంత కాలం నుంచి ఇంట్రెస్టింగ్ లైనప్ తోనే వస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాతో కూడా ఇంకో ఫ్రెష్ సబ్జెక్టు తో వస్తున్నట్టు అర్ధం అవుతుంది.

తన దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తో మరో సినిమాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం నుంచి వచ్చిన లేటెస్ట్ టీజర్ ఈ సినిమా కూడా సరికొత్త విజువల్స్ తో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఈ టీజర్ లో సుధీర్ బాబు రీల్ హీరోగా కొత్త లుక్స్ లో మంచి స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తూనే మంచి నటనతో ఆకట్టుకున్నట్టు కనిపిస్తున్నాడు.

అలాగే మెయిన్ హీరోయిన్ కృతి శెట్టి పై కూడా కనిపిస్తున్న కథనం ఇందులో ఆసక్తిగానే ఉంది. ఇంకా ఈ టీజర్ లో వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానితో పాటుగా టీజర్ లో కనిపించిన ఎమోషన్స్ అయితే మంచి ఎఫెక్టివ్ గా అనిపిస్తున్నాయి..

ఫైనల్ గా అయితే మళ్ళీ సుధీర్ బాబు, మోహన కృష్ణ ఇంద్రగంటిల నుంచి మరో ‘సమ్మోహన’ పరిచే సినిమాగా బహుశా అంతకు మించే ఉంటుందేమో అనిపిస్తుంది. ఒకవేళ ఆ టీజర్ చూడకపోతే ఈ క్రింద ఉంది ఒక లుక్ వెయ్యండి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :